Home > Featured > హైదరాబాద్‌లో ఏసీబీకి చిక్కిన లంచావతారం

హైదరాబాద్‌లో ఏసీబీకి చిక్కిన లంచావతారం

bribe officer.

తెలంగాణ రాష్ట్రంలో లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్న అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కొన్ని వారల క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హయత్‌నగర్‌లోని ఆమె ఇంట్లో రూ.93 లక్షల నగదు, 40 తులాలకు పైగా బంగారం, కొన్ని స్థలాలు, ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. తాజాగా ఆమె భర్త వెంకటేశ్వర్ నాయక్ ఏసీబీ డీఎస్పీ అధికారి అచ్చేశ్వర్ రావు బృందానికి చిక్కాడు. వెంకటేశ్వర్ నాయక్ జీహెచ్‌ఎంసీలో సూపరింటెండ్‌గా పనిచేస్తున్నారు.

ఈ సంఘటనలు మరువక ముందే లంచం తీసుకుంటూ కమర్షియల్ టాక్స్ అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ సరూర్ నగర్ ఏసీటీఓ సీహెచ్ శివ కుమార్ దొరికిపోయారు. వ్యాపారి మాదిరెడ్డి రాజిరెడ్డి వద్ద నుంచి ఆడిట్ రిపోర్ట్ కోసం శివకుమార్ 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. నాంపల్లిలోని డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో శివకుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated : 3 Sep 2019 3:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top