Anti-India graffiti on Swaminarayan temple; India raises issue with Canada
mictv telugu

కెనడాలో హిందూ ఆలయం ధ్వంసం.. ఖలిస్తానీ తీవ్రవాదుల పనే!

September 15, 2022

కెనడాలో నారాయణస్వామి ఆలయా గోడలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆల‌యంపై పిచ్చి రాత‌లు రాశారు. కెన‌డాకు చెందిన ఖ‌లిస్తానీ తీవ్ర‌వాదులు ఆ ప‌నిచేసి ఉంటార‌ని భావిస్తున్నారు. ఆల‌యాన్ని ధ్వంసం చేసిన ఆగంత‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భార‌త హై కమిషన్ ఓ ట్వీట్‌లో కోరింది. దోషులపై సత్వర చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరింది. “గ్రాఫిటీతో స్వామి నారాయణ మందిర్ ను పాడుచేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై విచారణ జరిపి, నేరస్థులపై చర్యలు తీసుకోవాలి’’ అని హైకమిషన్ ట్వీట్ చేసింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోడలపై ఖలిస్తానీ నినాదాలు కూడా రాశారు. ఈ ఘటనపై బ్రాంప్టన్ సౌత్ ఎంపీ సోనియా సిద్ధూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు. ఇలాంటి పరిణామాలు మంచివి కావన్నారు. కెనడా పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇదొక్కటే కాదు ఇలాంటి మరెన్నో ఘటనలు కెనడాలో జరిగాయి. హిందూ దేవాలయాలను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు’’ అని అన్నారు.