బంగారం గొలుసు చోరీ చేస్తున్న చీమలు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం గొలుసు చోరీ చేస్తున్న చీమలు.. వీడియో వైరల్

June 29, 2022

శ్రమజీవులైన చీమలు ప్రకృతి నుంచి ఏం ఆశిస్తాయి? వాటికి కావాల్సిన ఆహారాన్ని మాత్రమే సంపాదించుకోవడానికి అలుపెరగకుండా పని చేస్తాయి. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం మీకు దిమ్మతిరిగి పోవాల్సిందే. అందులో చీమల గుంపు ఒకటి ఓ గోల్డ్ చైన్‌ని దొంగతనం చేస్తున్నాయి. ఆశ్చర్యమనిపించినా ఇది నిజం. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వాటిని చిన్న స్మగ్లర్లుగా సంబోధిస్తూ.. ‘ఇప్పుడు వీటి మీద ఏ ఐపీసీ సెక్షన్ కింద కేసు పెట్టాలి’ అని సరదాగా క్యాప్షన్ పెట్టారు. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు పెడ్తున్నారు. ఇక నుంచి ప్రభుత్వాలు కూడా తమ నిబంధనలను మార్చుకోవాలని ఓ నెటిజన్, టీంగా కలిసి ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుందో ఈ చీమలు చెబుతున్నాయంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.