Anupama Parameswaran take blessing from Rajamouli
mictv telugu

రాజమౌళి కాళ్లు మొక్కిన అనుపమ…

August 13, 2022

Anupama Parameswaran take blessing from Rajamouli

అందానికి అందం, నటనకు నటనతో సత్తా చాటుతున్న మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్‌లో జెండాను బలంగానే పాతుతోంది. ఈ రోజు విడుదలైన నిఖిల్ సిద్ధార్థ మూవీ ‘కార్తికేయ 2’ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ సెలబ్రిటీలతో కలిసి హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్లో సందడి చేసింది. అనుకోకుండా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కనిపించడంతో పనిలో పనిగా అతని కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంది. సినిమా చూసినందుకు థ్యాంక్స్ చెప్పింది. ముగ్ధ పాత్రలో బాగా నటించావంటూ జక్కన్న కూడా ఆమెను అభినందించాడు.

‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’లో అనుసమ నటపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘అ ఆ’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, తదితర చిత్రాలతో తెలుగువారికి బాగా తెలిసిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ సరసన ’18 ప్లస్’ చిత్రంతోపాటు ‘బటర్ ఫ్లై’ చిత్రాల షూటింగులో బిజీగా ఉంది.