లైంగికంగా వేధించానా? ఆ రోజు దేశంలోనే లేను.. అనురాగ్  - MicTv.in - Telugu News
mictv telugu

లైంగికంగా వేధించానా? ఆ రోజు దేశంలోనే లేను.. అనురాగ్ 

October 2, 2020

anurag Kashyap denies all allegations in statement to Mumbai police, seeks severe action against Payal Ghosh for ‘misusing the criminal justice system’.

లైంగిక వేధిపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘కొత్త విషయం’ చెప్పాడు. సంఘటన జరిగినట్లు చెబుతున్న రోజున తాను అసలు మనదేశంలోనే లేనని చెప్పుకొచ్చాడు. నటి పాయల్ ఘోష్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టి పడేశాడు. 

కశ్యప్ 2013లో తనను లైంగికంగా వేధించాడని పాయల్‌ ఫిర్యాదు చేయడంతో ఆయనపై ముంబై పోసులు కేసు పెట్టడం తెలిసిందే. నిన్న ఆయనను వారు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తర్వాత ఆయన లాయర్ ప్రియాంకా ఖిమణీ మీడియాతో మాట్లాడారు. 2013లో కశ్యప్ వేధించినట్లు పాయల్ చెబుతున్న రోజు నా క్లయింట్ అసలు దేశంలోనే లేడు. అతడు ఆ సమయంలో సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలో ఉన్నాడు. మరి ఆయన పాయల్‌ను ఎలా వేధిస్తాడు? ఆమెవన్నీ తప్పుడు ఆరోపణలు. ఆమె అనురాగ్‌ పరువును తీసింది. ఆయన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకుంటాం.. ’ అని అన్నారు. పాయల్ ‘మీటూ’ ఉద్యమాన్ని దారితప్పించి కోర్టుల సమయాన్ని వృథా చేస్తోందని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఆరోపణలు వచ్చి చాలా రోజులే అవుతున్నా కశ్యప్ ‘శ్రీలంక్ టూర్’ గురించి చెప్పడం ఇదే తొలిసారి!