21 శతాబ్ధపు ప్రపంచ ఉత్తమ చిత్రాల్లో ఒకే ఒక భారతీయ సినిమా - MicTv.in - Telugu News
mictv telugu

21 శతాబ్ధపు ప్రపంచ ఉత్తమ చిత్రాల్లో ఒకే ఒక భారతీయ సినిమా

September 15, 2019

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ సినిమా 21వ శతాబ్దపు 100 ఉత్తమ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది గార్డియన్’ రూపొందించిన ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా జాబితాలో 59వ స్థానాన్ని దక్కించుకుంది. 

ఈ విషయాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ..’ఈ స్థానం దక్కినందుకు గర్వంగా ఉంది, కానీ ఇది నా జాబితా కాదు, నాకు ఇష్టమైన చాలా సినిమాలు నా చిత్రానికి దిగువ ఉండవు..’డార్క్ నైట్’ ఈ జాబితాలోని నంబర్ 1 చిత్రంగా ఉండటంపై నేను పూర్తి ఏకీభవిస్తున్నాను, ఆ సినిమాకు అర్హత ఉంది.’ అని క్యాప్షన్ పెట్టారు. రెండు చిత్రాలుగా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సిరీస్ 2012లో విడుదలైంది. జార్ఖండ్‌లోని ధన్బాద్ జిల్లాలోని వాస్సేపూర్ పట్టణంలో బొగ్గు మాఫియా కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొంది విజయం అందుకున్నాయి. ఈ చిత్రం ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ గ్యాంగ్ వార్ డ్రామాలో మనోజ్ బాజ్‌పేయి, నవాజుద్దీన్ సిద్దిఖీ, పియూష్ మిశ్రా, రిచా చద్దా ముఖ్య పాత్రల్లో నటించారు.

View this post on Instagram

Guardian’s list of 100 best film of 21st century . Proud to be here but this wouldn’t be my list.So many films which are my favourites can’t be below my film.. and “the Dark Knight” deserves to be way up. The number 1 film in the list I totally agree with. That’s my absolute favourite of the 21st century. Here is the list https://www.theguardian.com/film https://www.theguardian.com/film/2019/sep/13/100-best-films-movies-of-the-21st-century/2019/sep/13/100-best-films-movies-of-the-21st-century …. link also in bio. P.S. this is also is that film of mine that totally destroyed my filmmaking life by the expectations it sets from me as a filmmaker and has been continuously so , and I have forever been trying to break away from it. Hopefully someday that will happen .

A post shared by Anurag Kashyap (@anuragkashyap10) on