వాళ్లను కాల్చి పారేయాలి.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

వాళ్లను కాల్చి పారేయాలి.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

January 27, 2020

amit shah

సీఏఏ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ప్రభుత్వం కూడా వాటిని తిప్పికొట్టడానికి యాతన పడుతోంది. బీజేపీ కార్యకర్తలు కూడా ర్యాలీలు తీస్తున్నారు. అయినా నిరసనలదే పైచేయిగా మారుతోంది. ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద వేలాంది గుమికూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యోం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులు పేరు ప్రస్తావించకుండా.. దేశద్రోహులను కాల్చిపారేయాలని అన్నారు. 

ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ‘దేశద్రోహులను తూటాలతో చంపేయాలి..’ అని గట్టిగా, అన్నారు. దీనికి అక్కడి జనం హర్షం వ్యక్తం చేశారు. ఠాకూర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉన్నతపదవిలో ఉన్నవారు అలా మాట్లాడ్డ సరికాదని కాంగ్రెస్ మండిపడింది. కాగా సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులకు సీఎం కేజ్రీవాల్ మద్దితిస్తున్నారని ఆరోపించారు. సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న షార్జీల్ ఇమామ్ కు సీఎం మద్దతిస్తున్నారని మండిపడ్డారు.