అనుష్క ఫొటో ప్రొఫైల్ పిక్ పెట్టి..రూ.లక్ష కాజేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

అనుష్క ఫొటో ప్రొఫైల్ పిక్ పెట్టి..రూ.లక్ష కాజేశాడు

February 5, 2020

pytm

సైబర్ నేరాలు ఎక్కువవుతోన్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎంత అవగాహనా కల్పించిన కూడా కొందరు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఓ సైబర్ కేటుగాడు సినీ నటి అనుష్క ఫోటోను ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పిక్ గా పెట్టి ఓ యువకుడికి ఫ్రెండ్‌ రిక్వెస్‌ పంపించి రూ.1.1 లక్షలు కాజేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. దీనిపై బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అశోక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది.

యువతి పేరుతో, అనుష్క ఫొటో ప్రొఫైల్‌ పిక్చర్‌గా ఉండటంతో అతడు దాన్ని యాక్సెప్ట్‌ చేశాడు. ఆపై అవతలి వ్యక్తి యువతి మాదిరిగానే ఆరు నెలల పాటు చాటింగ్‌ చేశాడు. ఆపై అసలు కథ ప్రారంభమైనది. తన ఉద్యోగం పోయిందని, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నానంటూ చాట్‌ చేసింది. దీనికి యువకుడు కరిగిపోవడంతో కాస్త డబ్బు సాయం చేయమంటూ ఒక్కో దఫా రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పేటీఎం ద్వారా బదిలీ చేయించుకున్నారు. మొత్తం రూ.1.1 లక్షలు బదిలీ చేశాడు. తీరా అది నకిలీ అకౌంట్ అని తెల్సింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ దర్యాప్తు చేపట్టారు.