కోహ్లీ భార్య కూడా మైదానంలోకి.. తాప్సీకి పోటీగా.. - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ భార్య కూడా మైదానంలోకి.. తాప్సీకి పోటీగా..

January 13, 2020

Anushka Sharma.

సినిమా రంగంలో  బయోపిక్‌ల హవా నడుస్తోంది. నిజ జీవిత కథలతో సినిమాలు  తీసి దర్శకనిర్మాతలు విజయవంతం అవుతున్నారు. అలాంటి కథల కోసం వెతుకుతున్నారు. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన టీమిండియా లెజెండ్ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ తీయడానికి రంగం సిద్ధమైంది. ఆమె తన 18 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. మరి ఆమె పాత్రలో తెరమీద ఎవరు మెరుస్తారనేది గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. ఝలన్ పాత్రలో నటించనుంది.

ఝులన్ గోస్వామి బయోపిక్ విషయం అధికారికంగా బయటకు రాలేదు. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త బయటకు వస్తోంది. అయితే ఇటీవల ఝులన్, అనుష్కలు ఇద్దరూ మైదానంలో రిహార్సల్స్ చేస్తూ కనిపించారు. దీంతో ఈ రూమర్లు నిజమని అంటున్నారు. ఈ బయోపిక్‌కు ‘చక్‌దాహా ఎక్స్‌ప్రెస్’ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. 2019లో అనుష్క ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు. చివరిసారి షారూఖ్క్ ఖాన్, కత్రినాకైఫ్ నటించిన ‘జీరో’ సినిమాలో కనిపించింది. టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌‌ను ఇప్పటికే ప్రకటించారు. నటి తాప్సీ మిథాలీరాజ్ పాత్రను పోషిస్తోంది. ‘శభాష్ మిథు’ పేరుతో సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. అనుష్క, తాప్సీలు క్రికెటర్లు కనిపించనుండడంతో అభిమానులు ఎవరిక పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.