Anushka Sharma Cheap Publicity Tricks For Puma Brand
mictv telugu

దేశం గర్వించే కోహ్లీ భార్య.. నడిరోడ్డుపై ఇంత దిగజారడం ఏంటీ ?

December 22, 2022

 

Anushka Sharma Cheap Publicity Tricks For Puma Brand

బాలీవుడ్ నటి అనుష్క శర్మకి ఫ్యాషన్‌ ఫ్రీక్ అని పేరుంది. పెళ్ళై తల్లైనా పర్ఫెక్ట్ ఫిజిక్ తో అదరగొడుతుంది అనుష్క. పండుగలు, పార్టీలు ఇలా అన్ని రకాల ఈవెంట్స్ కి సూట్ అయ్యే ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తు లైమ్ లైట్ లో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో వరల్డ్ వైడ్ గా అనుష్కకి ఫాలోవర్స్ ఉంటారు. చాలా సార్లు తన ఫాలోయింగ్ ని మంచి పనులకి కూడా ఉపయోగించింది అనుష్క శర్మ. అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకి ఆర్థిక సహాయం, పేద పిల్లలని ఆడుకోవటం కోసం ఫండ్ రైసింగ్ ఈవెంట్స్ ని తన ఇంస్టాగ్రామ్ లో చేస్తుంటారు అనుష్క కోహ్లీల జంట. అయితే ఎందుకనో ఈ మధ్య అవి ఆపేసి కేవలం సొంత ప్రయోజనాలపైనే దృష్టి పెట్టారు. కోహ్లీ చరిష్మా కాస్త తగ్గుతూ వస్తుండటంతో సోషల్ యాక్టివిటీస్ కాకుండా.. అందరిలానే బ్రాండ్ ప్రమోషన్స్ చేయటానికే మక్కువ చూపెడుతున్నారు. అయితే ఈ సారి ఇది కాస్త శృతి మించింది.

అనుష్క బ్రాండ్స్ లో బిగ్గెస్ట్ బ్రాండ్ పూమా. పెళ్ళికి ముందు నుండే పూమాకి బ్రాండ్ అంబాజిడర్ గా కొనసాగుతుంది. అయితే మొన్న సడెర్న్ గా పూమాపై ఫైర్ అయింది అనుష్క. తన అనుమతి లేకుండా పూమా తన ఫోటోలని ఎలా ఉపయోగించుకుంటుంది అని సీరియస్ అయింది. కాంట్రాక్టు ముగిశాకా బ్రాండ్ ప్రమోషన్ చేయడంపై తన ఇంస్టా అకౌంట్ లో ప్రశ్నించిన పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయింది. పూమాకి అనుష్కకి చెడిందా అన్న డౌట్స్ కారణంగా భారీ ప్రమోషన్ వచ్చింది. అయితే ఇదంతా ఫేక్ పబ్లిసిటీ స్టంట్ అని ప్రస్తుతం బయటపడింది. మొన్న ఉదయం పూమా బ్రాండ్ బట్టలు వేసుకుని ముంబై వీధుల్లో కనిపించిది అనుష్క. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో.. తెలుపు రంగు టీ-షర్ట్, స్పోర్ట్స్ ప్యాంట్, జాకెట్‌లో.. రెడ్ కలర్ ఓపెన్ కారుపై ఎక్కి నడిరోడ్డుపై అభిమానులను పలకరిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది అనుష్క. అయితే ఇది చూసి అవాక్కయ్యారు ఫ్యాన్స్. మొన్ననే తిట్టుకున్నట్టు నటించి ఇప్పుడు పూమా బ్రాండ్ బట్టలు వేసుకోవటం అనుష్క చీప్ ట్రిక్స్ అంటూ మండిపడుతున్నారు నెటిజన్స్. దేశం గర్వించే కోహ్లీ భార్య స్థానంలో ఉండి ఇలాంటి చీప్ పబ్లిసిటీ పనులు అవసరమా.. డబ్బుల కోసం మరీ ఇంట దిగజారాలా అంటూ ఫైర్ అవుతున్నారు. బ్రాండ్ ప్రమోషన్ కోసం పూమా, అనుష్కలు కలిసి ఆడిన సిల్లీ గేమ్ అంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజాపై వేటు..

దిగ్విజయ్ సింగ్ మా సమస్యను పరిష్కరిస్తారు.. కాంగ్రెస్ నేతలు