గవాస్కర్‌ను ఏకి పారేసిన అనుష్క శర్మ.. నా భర్త.. - MicTv.in - Telugu News
mictv telugu

గవాస్కర్‌ను ఏకి పారేసిన అనుష్క శర్మ.. నా భర్త..

September 25, 2020

Anushka Sharma hits back after Sunil Gavaskar’s commentAnushka Sharma hits back after Sunil Gavaskar’s comment.

గురువారం కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోరంగా ఓడిపోయింది. ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌కి కామెంటరింగ్ చేస్తున్న సునీల్ గవాస్కర్..’లాక్‌డౌన్‌లో కోహ్లీ ఇంట్లో అనూష్క శర్మ బంతులతో ప్రాక్టీస్ చేశాడు’ అని అసభ్యకర కామెంట్ చేశాడు. దీనిపై బాలీవుడ్ నటి, కోహ్లీ భార్య అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త ఆటలోకి తననేందుకు లాగుతున్నారని ప్రశ్నించింది. తనపట్ల గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయని మండిపడింది. 

 

 

‘ఎన్నో సంవత్సరాలుగా క్రికెట్ కామెంట్రీ చెబుతున్న మీరు ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించి ఉంటారు. నాకు, కోహ్లికి కూడా ఇలాగే గౌరవం ఇవ్వాలని మీరు అనుకోలేదు? నా భర్త ఆటతీరు గురించి మాట్లాడానికి మీ మనసులో మరెన్నో పదాలు ఉంటాయని తెలుసు. క్రికెట్ విషయంలో నన్ను లాగడం ఎప్పుడు మానుకుంటారు. నాపై అసభ్యకర కామెంట్లు చేయడం ఎప్పుడు మనుకుంటారు. గౌరవనీయులైన గావస్కర్ మీరో లెజెండ్. క్రికెట్లో మీరెంతో పేరు సంపాదించారు. మీరు ఇలా చెప్పడం వినగానే నాకెంతో బాధేసింది.’ అని అనుష్క సోషల్ మీడియాలో తెలిపింది. ఈ వివాదంలో నెటిజన్లు అనుష్కకు బాసటగా నిలుస్తున్నారు. సునీల్ గవాస్కర్‌ను పద్దతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం సునీల్ గవాస్కర్ తప్పుడు అర్థంతో అనలేదని అంటున్నారు. లాక్‌డౌన్‌లో కోహ్లీ దంపతులు క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. బహుశా గవాస్కర్ ఆ వీడియోను దృష్టిలో ఉంచుకుని ఈ కామెంట్ చేసి ఉంటాడని అంటున్నారు.