అనుష్కా శర్మ  షూటింగ్ లో అపశ్రుతి  - MicTv.in - Telugu News
mictv telugu

అనుష్కా శర్మ  షూటింగ్ లో అపశ్రుతి 

August 31, 2017

బాలీవుడ్ నటి అనుష్కా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ పరి ’. ప్రసిత్ రాయ్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది.  కరెంట్ షాక్ తగిలి టెక్నీషియన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని పేరు షాహ్ ఆలమ్. ఉత్తర ప్రదేశ్ కు చెందిన అతను సినిమాలకు లైట్ మెన్ గా పని చేస్తున్నాడు. చివరి షెడ్యూల్ కోసం వెస్ట్ బెంగాల్ పరగాణ జిల్లాకు వెళ్లింది చిత్ర బృందం. ఆ సినిమా మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్నది కాబట్టి లైటింగ్ అవసరం చాలా వుంటుంది. వర్షాల కారణంగా వైరు దెబ్బతిని ఉండటంతో అతనికి షాక్ కొట్టింది. పైగా తడి గుడ్డలతో వుండటం వల్ల కరెంట్ షాక్ చాలా బలంగా తగిలింది. యూనిట్ బృందం అతణ్ని కాపాడటానికి చేసిన ప్రయత్నం విఫలం అయింది.  ‘ పరి ’చిత్ర బృందం టెక్నీషియన్ మరణంతో షూటింగును క్యాన్సిల్ చేస్కుంది. ఫిబ్రవరి 9 2018 కు విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా ఈ దుర్ఘటనతో మరింత ఆలస్యం అయ్యేట్టున్నది.

తెర మీద అందంగా చూపించటానికి తెర వెనుక ఎంత మంది టెక్నీషియన్లు పని చేస్తారో లెక్కే లేదు. అంత కష్టపడ్డ వారికి అస్సలు గుర్తింపు వుండదు. పైనుంచ,ి ఇలాంటి ప్రమాదాలు సంభవించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చాలా మంది టెక్నీషియన్లు. మన తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. రవితేజ ‘ బలాదూర్ ’ సినిమా షూటింగప్పుడు అతని డూప్ ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయాడు. ఆ మధ్య కన్నడ సినిమా షూటింగ్ లో కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు ఫైట్ మాస్టర్లు చనిపోయారు. చిత్ర బృందాలు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. షూటింగుల సమయంలో సెలెబ్రిటీలకు అన్నీ జాగ్రత్తలు తీస్కున్నట్టే, టెక్నీషియన్లకు కూడా అన్నీ జాగ్రత్తలు తీస్కుంటే బాగుంటుందేమో.