భారత్ స్టార్ క్రికెటర్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఐటీ శాఖకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన కోర్టు.. స్పందించాల్సిందిగా ఐటీ శాఖకు సమన్లు జారీ చేసింది. తదుపరి వాయిదాను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. అంతకుముందు మహారాష్ట్ర వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్ కింద 2012-13, 2013-14 ఆర్ధిక సంవత్సరాల్లో అనుష్క శర్మ చెల్లించాల్సిన బకాయిలను పెంచుతూ మజ్ గావ్ లోని సేల్స్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను బకాయిలను రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో టాక్స్ కన్సల్టెంట్ శ్రీకాంత్ ద్వారా సవాల్ చేస్తూ అనుష్క శర్మ రెండు పిటిషన్లను దాఖలు చేశారు. పిటిషన్లను విచారణకు అంగీకరించిన బాంబే హైకోర్టు ప్రతివాది ఐటీ శాఖకు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.