విరాట్‌తో కలిసున్నది 21 రోజులే.. అనుష్క లెక్కలు  - MicTv.in - Telugu News
mictv telugu

విరాట్‌తో కలిసున్నది 21 రోజులే.. అనుష్క లెక్కలు 

July 2, 2020

Anushka Sharma Spent just 21 days With Husband

నాలుగేళ్ల ప్రేమాయనం తర్వాత ఒక్కటైన సెలబ్రెటీ జంట అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ. ఈ జంటను చూసి ముచ్చటపడిపోతూ అంతా ముద్దుగా విరుష్క అని పిలుస్తూ ఉంటారు. ఈ సెలబ్రెటి కపుల్ తమ పెళ్లి తర్వాత విషయాలను మీడియాతో పంచుకున్నారు. అనుష్క శర్మ ఇటీవల ‘వోగ్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పెళ్లి తర్వాత ఆరు నెలల జీవితాన్ని పూసగుచ్చినట్టుగా వివరించారు. ఆ సమయంలో తమ జీవితాలు ఎంత బిజీగా ఉన్నాయో చెప్పారు. ఆరు నెలల  కాలంలో తామిద్ధరం కేవలం 21 రోజులు మాత్రమే కలిసి ఉన్నట్టుగా వెల్లడించారు. 

ఇద్దరూ సెలబ్రెటీలు కావడంతో ఎవరి పనిలో వారు బిజీ అయిపోయే వారట. ‘కొహ్లీ క్రికెట్ ఆడేందుకు వెళ్లినప్పుడు నేను ఇంట్లో ఉండేదాన్ని. విరాట్‌కు విశ్రాంతి దొరికే సమయానికి నాకు షూటింగ్స్ ఉండటంతో పరుగులు పెట్టాల్సి వచ్చేది. కేవలం కలిసి భోజనం చేసేందుకు బయటకు వెళ్లడానికే సమయం దొరికేది. కొన్నిసార్లు అయితే భోజనం చేసేందుకు విదేశాల్లో కలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఎంతో విలువైనదిగా అనిపించేది’ అంటూ చెప్పుకొచ్చారు. పెళ్లైన ఆరు నెలల్లో తాము కలిసిన ప్రతీ రోజును లెక్కబెట్టానని వివరించారు. అయితే లాక్‌డౌన్ వల్ల తామిద్దరం మరింత ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్టు వెల్లడించారు.