ఆల్ ది బెస్ట్ ‘సాహో’.. అనుష్క ట్వీట్ వైరల్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆల్ ది బెస్ట్ ‘సాహో’.. అనుష్క ట్వీట్ వైరల్..

May 21, 2019

బాహుబలి-2 తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ప్రభాస్ ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశాడు. ఆసక్తి కరంగా ఆ పోస్టర్‌ అభిమానులకు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పోస్టర్ హీరోయిన్ అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

‘ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు, బృందంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జైటెడ్‌’ అని పేర్కొంది.

‘భాగమతి’ సినిమా తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న అనుష్క.. ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.