బరువు ఎలా తగ్గాలి?.. అనుష్క పుస్తకం - MicTv.in - Telugu News
mictv telugu

బరువు ఎలా తగ్గాలి?.. అనుష్క పుస్తకం

May 16, 2019

Anushka Shetty writes a book on her weight-loss secret.

సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క శెట్టి.. ఇప్పుడు తిరిగి సన్నగా తయారై మేకప్ వేసుకునేందుకు సిద్ధమైంది. ఆమె సైజ్ జీరో సినిమా తరువాత బాహుబలి, భాగమతి సినిమాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు విజయం సాధించినా కూడా ఆపై దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఈ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు అనేక ఇబ్బందులు పడిందట.

ఎట్టకేలకూ బరువు తగ్గిన అనుష్క ఇప్పుడు బరువు తగ్గిన విధానాన్ని వివరిస్తూ “ది మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్” పేరుతో ఓ పుస్తకం రాసింది. త్వరలోనే ఆ పుస్తకం ఇంగ్లీష్ భాషలో విడుదల కానుందని సమాచారం. దీంతో అనుష్క బరువు తగ్గడానికి పడిన పాట్లు తన అభిమానులు త్వరలోనే తెలుసుకోబోతున్నారు. ఇక అనుష్క సినిమాల విషయానికస్తే ఆమె ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకోనున్న ‘సైలెన్స్’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కోసం ఆమె అమెరికాకు వెళ్ళింది. ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్, షాలినీ పాండే తదితరులు నటిస్తున్నారు.