అనుష్క ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

అనుష్క ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

September 11, 2019

Anushka ...

ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లో రాణిస్తున్న అనుష్క మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో రూపొందుతున్న 

నిశ్శబ్ధం చిత్రంలో ఆమె నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ చిత్రయూనిట్ విడుదల చేసింది. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా సన్నివేశాలు దాదాపు అంతా విదేశాల్లోనే చిత్రీకరించారు. 

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ‘సాక్షి’ అనే ఒక ఆర్టిస్ట్ పాత్రలో డ్రాయింగ్ చేస్తూ కనిపిస్తోంది.  అనుష్క పెయింటింగ్ ద్వారానే మ‌న‌సులోని మాట‌ల‌ని చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇందులో ఆమె లుక్ పూర్తి డిఫరెంట్ గా వుంది. దీన్ని బట్టి ఈ సినిమా పూర్తి వైవిధ్యభరితమైనదిగా అర్థం అవుతోంది. ఇప్పటికే ఎవరూ చూడని విధంగా అనుష్కను ఈ సినిమాలో చూడబోతున్నారంటూ చిత్ర యూనిట్ చెప్పింది. తాజాగా విడుదలైన పోస్టర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. 

ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరన సినిమా ప్రేక్షుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల నటిస్తున్నారు.