Home > సామాన్యుల్లా క్యూలో అనుష్క…

సామాన్యుల్లా క్యూలో అనుష్క…

డ్రెస్సింగ్ లోనే కాదు సింపుల్ సిటిలో స్వీటీ సంథింగ్ స్పెషల్. సౌతిండియా స్టార్స్ లో ఒకరిగా అనుష్క క్యూలో నిలబడి మరి దేవుడ్ని దర్శించుకుంది.
‘బాహుబలి 2’ తో మంచి విజయాన్ని అందుకున్న ఆమె కర్ణాటక కొల్లూరులోని మూకాంబిక ఆలయాన్ని దర్శించుకున్నారు. తన తల్లి ప్రఫుల్లా, తండ్రి విఠల్‌, సోదరుడు గుణరంజన్‌, సామాజిక కార్యకర్త-రాజకీయ నాయకుడు ముత్తప్పరాయ్‌తో కలిసి ఆలయానికి వెళ్లింది. సామాన్య భక్తులతో పాటు క్యూలో నిల్చొన్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు చేసే హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా సామాన్య భక్తురాలిగా పూజ ముగించుకుని వెళ్లడం అక్కడి తోటి భక్తులతో పాటు అభిమానులనూ ఆకట్టుకుంది.

Updated : 22 May 2017 7:03 AM GMT
Next Story
Share it
Top