విజయ్‌ దేవరకొండపై అనసూయ ట్వీట్.. రచ్చరచ్చ! - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్‌ దేవరకొండపై అనసూయ ట్వీట్.. రచ్చరచ్చ!

May 5, 2020

Anusuya tweet on Vijay Devarakonda ..

జబర్దస్త్ యాంకర్ అనసూయ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. ‘మన వరకు వస్తే కానీ బుద్ధి రాదన్న మాట.. హమ్.. మ్అంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్‌ను నెటిజన్లు విజయ్ దేవరకొండనే అనిందని అంటున్నారు. విజయ్‌పై ఆమె ఇటువంటి కామెంట్ చేయడం సరికాదని చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో ఆ సినిమాలో అమ్మపై విజయ్ దేవరకొండ చేసిన అసభ్యకర డైలాగుపై అనసూయ మండి పడిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పదాలు సమాజంలో మాట్లాడుకుంటూనే ఉంటారని అప్పట్లో విజయ్ కూడా దీటుగా సమాధానం ఇచ్చాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అనసూయ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మీరు చెప్పింది నిజమే అనసూయ గారూ.. మనదాకా వస్తే కానీ ఎవరికీ నొప్పి తెలియదు. కానీ ఇప్పటికన్నా వాళ్లు ముందుకు వస్తున్నపుడు.. మీలాంటివాళ్లు కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే వదిలేస్తే మీలాంటి సెలెబ్రిటీలు ముందు ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందిఅని మరో నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తంచేశాడు.

కాగా, విజయ్ కరోనా సంక్షోభంలో పేద కుటుంబాలకు వెయ్యి రూపాయల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై నాలుగు వెబ్‌సైట్లు తన గురించి పలు రకాలుగా వదంతులు రాయడంపై విజయ్‌ మండిపడ్డాడు. ఆ వెబ్‌సైట్లు తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నాయని వీడియోలో తెలిపాడు. ఈ క్రమంలో విజయ్‌కు సినీ పరిశ్రమ నుంచి భారీగా స్పందన వస్తుండగా యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.