రేవంత్‌ తప్ప ఎవరైనా ఓకే.. పీసీసీ పగ్గాలపై జగ్గారెడ్డి  - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్‌ తప్ప ఎవరైనా ఓకే.. పీసీసీ పగ్గాలపై జగ్గారెడ్డి 

June 1, 2020

Anyone except Revanth is not okay .. Jagga reddy on PCC

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే వ్యతిరేకిస్తానని‌ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. రేవంత్‌కి పీసీసీ ఇవ్వొద్దనే చెప్తానని చెప్పారు. పీసీసీ  పగ్గాలపైమళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిపారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఉత్తమ్‌ను మార్చొద్దంటూ రాహుల్ గాంధీకి లేఖ రాస్తానన్నారు. పీసీసీ అడుగుతున్నాడన్న ఆయన అభిప్రాయాలు తీసుకోకుండా.. ఆయన, నన్ను అడగకుండా రేవంత్‌కి పీసీసీ ఇస్తే… నా రాజకీయం నాకు ఉంటుందని స్పష్టంచేశారు. తనకూ కొత్త ఆలోచన ఉందని అన్నారు. రేవంత్‌కి కాకుండా ఇంకెవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. రేవంత్ మీద తనకు అపోహలు ఉన్నాయనీ.. ఆ విషయాలు రేవంత్‌కే చెప్తానని పేర్కొన్నారు.

తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని అన్నారు. ‘ఉత్తమ్ ఆయన భార్యను గెలిపించుకోలేదు కాబట్టి అన్ ఫిట్ అనేది రేవంత్ వర్గం చేసిన ప్రచారం. మరి అందరినీ గెలిపిస్తా అని తిరిగిన రేవంతే ఓడిపోయాడు కదా ? రేవంత్ సోషల్ మీడియా టీం దానికి ఏమంటారు..?‌ కాంగ్రెస్‌లో చాలా మంది ప్రభుత్వ కోవర్టులు ఉన్నారు. పార్టీ ఇంఛార్జీ కుంతియా చుట్టే ఆ కోవర్టులు ఉన్నారు’ అని జగ్గారెడ్డి ఆరోపించారు. మరోవైపు తన కూతురు జయారెడ్డికి రాజకీయాలు అంటే ఇష్టం లేదనీ.. కానీ పరిస్థితిని బట్టి జయారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నానని చెప్పారు. తనపై రాజకీయ కక్ష సాధింపుకు దిగితే నా కూతురు రాజకీయాల్లోకి వస్తుందని, జగ్గారెడ్డి కంటే గట్టిగా కొట్లాడుతుందని అన్నారు.