ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉ.9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి CBSE తరహాలో రోజు తప్పించి రోజు పరీక్షలు ఏర్పాటు చేశారు.
ఏపీ 10TH పరీక్షల షెడ్యూల్
ఏప్రిల్ 03 (సోమవారం) – ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 06(గురువారం) -సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 08(శనివారం) -ఇంగ్లీష్
ఏప్రిల్ 10(సోమవారం) -గణితం
ఏప్రిల్ 13(గురువారం) -జనరల్ సైన్స్
ఏప్రిల్ 15(శనివారం) -సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17(సోమవారం) -కాంపోజిట్ కోర్స్
ఏప్రిల్ 18 మంగళవారం- (ఒకేషనల్ కోర్స్)
తెలంగాణలోనూ ఆరు పేపర్లు
తెలంగాణలోనూ ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు నిర్వహిస్తుండగా.. 6 పేపర్లకు కుదించినట్లు తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. పది పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగనున్నాయి
తెలంగాణ 10TH పరీక్షల షెడ్యూల్
ఏప్రిల్ 3 – ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 4 – సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 – (ఇంగ్లీష్)
ఏప్రిల్ 8 – గణితం
ఏప్రిల్ 10 – జనరల్ సైన్స్
ఏప్రిల్ 11- సోషల్ స్టడీస్
ఏప్రిల్ 12 – ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
ఏప్రిల్ 13 – ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం..లాస్ట్‌డేట్ ఎప్పుడంటే.. ?
ఇంటర్మీడియట్‌తో సాఫ్ట్వేర్ కొలువు..గ్రామీణ విద్యార్థులకు సువర్ణావకాశం