ఏపీలో పదో తరగతి పరీక్షా షెడ్యూల్ ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో పదో తరగతి పరీక్షా షెడ్యూల్ ఇదే

May 12, 2020

AP 10th Class Exams

ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో వైరస్ వ్యాప్తి కొంతమేర అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

దీనిపై మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. 

మే నెల చివరి వారంలో జరుగుతాయని ఇప్పటి వరకు జరిగిన ప్రచారాన్ని ఖండించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. మరోవైపు ఈసారి పరీక్షా  కేంద్రాలను కూడా పెంచనున్నట్టు తెలిపారు. గతంలో 2,900 కేంద్రాలు ఉండేవని, కానీ ఇప్పుడు భౌతిక దూరం నిబంధన పాటించాల్సిన అవసరం ఉండటంతో వీటి సంఖ్య పెంచాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి ప్రకటనతో ఇక జులై వరకు పదో తరగతి పరీక్షలు జరిగే అవకాశం లేదని స్పష్టమైంది.