AP: 'ACB 14400' Services Directed by: Sameer Sharma
mictv telugu

ఏపీ: ‘ఏసీబీ 14400’ సేవలు షురూ: సమీర్‌ శర్మ

July 27, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ తెలిపారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ లంచం అనే పదం వినపడకుండా, ఏ అధికారి లంచం తీసుకోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఏదైనా అవసరాల రీత్యా ప్రభుత్వ ఆఫీసుకు వెళితే, అక్కడ ఏ అధికారి అయినా లంచం అడిగితే వెంటనే ‘ఏసీబీ 14400’ అనే యాప్‌లో ఫిర్యాదులు చేయాలని, ఈ ‘ఏసీబీ 14400’ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లో మొదలైయ్యాయని ఆయన అన్నారు.

సమీర్ శర్మ మాట్లాడుతూ..”ఈ ‘ఏసీబీ 14400 యాప్‌’ సేవలు రాష్ట్రవ్యాప్తంగా షురూ అయ్యాయి. ప్రజలు ఏదైనా పనికోసం ప్రభుత్వ ఆఫీస్‌కి వెళ్తే, అక్కడ ఏ అధికారి అయినా లంచం అడిగితే వెంటనే యాప్‌లో ఫిర్యాదు చేయండి. ఈ యాప్‌లో వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు వీలైన సౌకర్యం ఇందులో ఉంది. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత మొబైల్‌కు ఆ ఫిర్యాదుకు సంబంధించిన రిఫరెన్స్‌ వస్తుంది. ఈ యాప్‌ను ప్రజలు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి” అని ఆయన అన్నారు.

ఈ ‘ఏసీబీ 14400 యాప్‌’పై ఆయన మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్‌‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏసీబీ 14400 కాల్‌ సర్వీసులు, దానిపై రూపొందించిన యాప్‌పై వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఏసీబీ 14400 యాప్‌పై అధికారులు విస్కృతంగా ప్రచారం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.