ఏపీ, తెలంగాణ అభ్యర్థుల్లారా..ఇవాళ్టి నుంచే దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎనిమిది, పదోవ తరగతి పాసైన అభ్యర్థులకు ఆర్మీ అధికారులు ఓ శుభవార్తను చెప్పారు. ఆర్మీ ఉద్యోగాల కోసం కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న వారు..అగ్నిపథ్ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు శుక్రవారం నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ అధికారులు గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.
"అగ్నిపథ్ పథకంలో భాగంగా ఆర్మీ ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ ఉద్యోగాలకు ఆప్లై చేసుకోవాలని ఆశగా ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.joinindianamy.nic.inలో దరఖాస్తులు చేసుకోండి. అక్టోబరు 1 నాటికి 23 ఏళ్ల వయస్సు కలిగినవారే అర్హులు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగంలో పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు మాత్రం ఎనిమిదోవ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. భారత సైన్యం ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తుంది. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, దరఖాస్తులు చేసుకోండి" అని ప్రకటనలో పేర్కొన్నారు.