AP: Another accident at Parry Sugars..Two killed
mictv telugu

ఏపీ: ప్యారీ షుగర్స్‌లో మళ్లీ ప్రమాదం..ఇద్దరు మృతి

August 29, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడ జిల్లా వాకలపూడిలోని ప్యారీ షుగర్స్‌ పరిశ్రమలో ఈ నెల 19న పేలుడు ప్రమాదం జరిగి, ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగి, 11 రోజులు గడవక ముందే తాజాగా మరోసారి ప్రమాదం జరిగింది. ఈసారి కూడా ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే, అతికొద్ది రోజుల్లోనే పరిశ్రమలో మళ్లీ ప్రమాదం జరగడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. బాయిలర్ పేలడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రులను కాకినాడ జీజీ‌హెచ్‌కు తరలించారు. వాకలపాడి పారిశ్రామికవాడ ప్రాంతంలో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ పరిశ్రమలో పంచదారను శుద్ధి చేసి, ఎగుమతి చేస్తుంటారు.

ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరైనా చనిపోయారా అనే విషయాలపై ఎలాంటి సమాచారం లేదు. ఆస్పత్రి వద్దకు సిబ్బంది వచ్చినా వాళ్లు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదు. మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారలు హెచ్చరించినా, మళ్లీ అక్కడ ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. తాజాగా జరిగిన ప్రమాదంలో మృతులను రాగం ప్రసాద్, సుబ్రమణ్యేశ్వరరావుగా గుర్తించారు.