AP: Another step forward by Jagan Sarkar..617 in total
mictv telugu

ఏపీ: జగన్ సర్కార్ మరో ముందడుగు..ఏకంగా 617

July 22, 2022

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 617 కొత్త బస్సులను నడిపేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఉపిందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. దశాబ్ద కాలంగా ఏపీలో పాత బస్సులతోనే గత ప్రభుత్వం నెట్టికొచ్చిదని, ఇకపై 617 కొత్త బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యిందని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో 617 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు, అద్దె ప్రాతిపదికన 2,307 బస్సులను ప్రవేశపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వివరాలను వెల్లడించారు.

అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ..”దశాబ్దంగా కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల ప్రజలు బస్సులు లేక పాత బస్సుల మోత తట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ పాత బస్సుల వల్ల ఆర్టీసీ యాజమాన్యం సైతం సతమతమవుతోంది. ఆర్టీసీలోని 2,925 బస్సులు 12 లక్షల కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించాయి. అయినా, పదేళ్లుగా కొత్త బస్సుల కొనుగోలుకు గత ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సాహసించలేకపోయింది” అని  అన్నారు.

అయితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగుల జీతాల భారం ఏటా దాదాపు రూ.3,600 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది. ఆర్టీసీ వ్యయంలో దాదాపు 40 శాతం జీతాల చెల్లింపునకే వెచ్చించాల్సి వచ్చేది. రెండేళ్లుగా ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుండటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కుదుటపడుతోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఆర్టీసీ కార్యాచరణకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలను ఆమోదించింది అని అధికారులు వివరించారు.