Home > Featured > ఏపీ: ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఏపీ: ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖారారైంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 15 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని, సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై, నిర్ణయం తీసుకుంటుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.

ఇక, ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 15న ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే, 5 రోజులపాటు కొన‌సాగ‌నున్నాయి. అదే స‌మ‌యంలో ఈ నెల 15న ఉద‌యం 10 గంట‌ల‌కు ఏపీ శాస‌న మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. మండ‌లి స‌మావేశాలు కూడా 5 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో 3 రాజ‌ధానుల‌కు సంబంధించిన బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే దిశ‌గా వైసీపీ స‌ర్కారు క‌స‌రత్తు చేస్తుంది. అంతేకాదు, ప‌లు కీల‌క బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సిద్దమైందని సమాచారం.

Updated : 10 Sep 2022 2:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top