నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

March 7, 2022

jagan

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సభలు సోమవారం ఉదయం 11:00 గంటలకు మొదలుకానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి.. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం చేయనున్నారు. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కరోనా కారణంగా 2020,2021 బడ్జెట్‌ సమావేశాల సమయంలో వర్చువల్‌ విధానంలో మాట్లాడిన విషయం తెలిసిందే.

గవర్నర్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. బీఏసీ సమావేశం ముగిశాక వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.