వానొస్తే పై నుంచి జలధారలే..ఎంతైనా సింగపూర్ డిజైన్స్ కదా…
వానొచ్చిందంటే ఏపీ సచివాలయం చెరువులా మారుతుంది. మామూలుగా కాదు అధికార,విపక్షాలకు మధ్య యుద్ధం పుట్టించే మాంచి స్టప్ఫావుతుంది. ఎప్పుడు చినుకులు రాలిన ఏపీ అసెంబ్లీ , సచివాలయం చాంబర్లలోకి వరద పోటెత్తుతోంది. ఆ మధ్య ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాంబర్‌లోకి వర్షపు నీరు చేరితే…ఇప్పుడు మంత్రులు దేవినేని, గంటా చాంబర్లలోకి వరద పోటెత్తింది. ఎంతైనా సింగపూర్ , జపాన్ డిజైన్లు కదా…ఇలాగే ఉంటాయెమో.
నాల్గొ బ్లాక్‌లోని రెవెన్యూశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చాంబర్‌లో సీలింగ్ ఊడిపడింది. దీంతో వర్షానికి పై నుంచి నీళ్లు కారుతున్నాయి. మంత్రులు దేవినేని, గంటా ఆఫీసుల్లో సీలింగ్ రూఫ్ ప్లేట్లు ఊడిపడ్డాయి. జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ ఆఫీసులో ఫర్నిచర్ పూర్తిగా వరదనీటితో తడిసిపోయింది. జలనవరుల శాఖ ఆఫీసులోనూ సీలింగ్ రూఫ్ ప్లేట్లు ఊడిపోయాయి.
ఎంత తాత్కాలిక భవనాలనైనా ఇంత దారుణంగా ఉంటాయా..?.చినుకులు రాలితే వరదలా పారుతాయా..? ఎడ గుడారమేసినా బొట్టు లోపలకు రాలదు. కానీ కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్ లు మాత్రం లీక్ అవుతున్నాయి..ఎందుకిలా… తాత్కాలికమే అనుకుని బడాకాంట్రాక్టు కంపెనీలు నిర్మాణాల్సి మమ అనిపించాయా..? పెదబాబు సారూ…శాశ్వత నిర్మాణాలైనా చక్కగా కట్టించండి..లేదంటే 2019 దగ్గర్లలోనే ఉంది. జనానికి అప్పటిదాకా గుర్తుకు ఉంటే తప్పదు షాక్…జరభద్రం.