ఏపీ..వంటగ్యాస్ కస్టమర్లకు చేదువార్త.. భారీగా పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ..వంటగ్యాస్ కస్టమర్లకు చేదువార్త.. భారీగా పెంపు

June 15, 2022

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఇంధన సంస్థలు చేదువార్తను చెప్పాయి. ప్రస్తుతం ఉన్న డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచుతూ, మంగళవారం ప్రకటన విడుదల చేశాయి. విడుదల చేసిన ప్రకటన ప్రకారం..”గృహ వినియోగ (14.2 కిలోల) సిలిండర్ డిపాజిట్ ధర 1.450 నుంచి రూ. 2,200కు, అయిదు కిలోల సిలిండర్ ధర రూ. 800 నుంచి రూ.1,150లకు పెరిగింది. రెగ్యులేటరు ఇక నుంచి రూ.250 తీసుకుంటాం. పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త కనెక్షన్లు తీసుకునే వారికే ఇవి వర్తిస్తాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవు” అని ఇంధన సంస్థలు పేర్కొన్నాయి.

మరోపక్క పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని తెలుపడంతో కొత్తగా గ్యాస్ సిలిండర్ కొనాలని, కనెక్షన్ తీసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి గట్టిషాక్ తగిలినట్లైంది. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఇప్పటికే దశల వారీగా సిలిండర్ ధరలను పెంచుతూ, ప్రభుత్వాలు సామాన్యుడిపై పెను భారాన్ని మోపాయి. ఈ క్రమంలో మరోసారి వంటగ్యాస్‌ కనెక్షన్‌ డిపాజిట్‌ను అమాంతంగా పెంచడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సుమారు లక్షకు పైగా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తుండగా, రోజుకు 50 వేల నుంచి 75 వేల కనెక్షన్లను మంజూరు చేస్తున్నారు.