AP bans derogatory words against Nayi Brahmins
mictv telugu

మంగలి, మంగలోడా అంటే చట్టపరమైన చర్యలు : ఏపీ ప్రభుత్వం

August 11, 2022

నాయీ బ్రాహ్మణుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వారిని అవమానపరిచేలా మంగలి, మంగలోడా, మంగలిది, కొండమంగలి, బొచ్చు గొరిగేవాడు అనే పదాలను ఉపయోగిస్తే వారిని అవమానపరిచినట్టుగా భావిస్తారు. ఎవరైనా ఈ పదాలు వాడితే వారిపై భారత శిక్షాస్మృతి 1860 చట్టం కింద చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు పై పదాలను నిషేధిస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి జీవో జారీ చేశారు. ఈ జీవో ఆగస్టు 7వ తేదీనే జారీ అయినప్పటికీ బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇలాంటి పదాలను నిషేధించడం వల్ల రాబోయే కాలంలో తమ వృత్తికి మరింత గౌరవం పెరుగుతుందని వారు భావిస్తున్నారు.