బ్రాహ్మణులకు జగన్ కానుక.. రూ. 15 వేలు - MicTv.in - Telugu News
mictv telugu

బ్రాహ్మణులకు జగన్ కానుక.. రూ. 15 వేలు

February 26, 2020

AP Brahmin.

ఏపీ ప్రభుత్వం వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పటికే అమ్మ ఒడి, జగనన్న వసతి ఇలా ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ప్రభుత్వం ఆకట్టుకుంటోంది. నవరత్నాలతో పాటూ కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాలకు చేయూతనిస్తున్న సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది.పేద బ్రాహ్మణులకు చేయూతనిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒడుగు పేరుతో రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

7 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న పేద బ్రాహ్మణుల పిల్లలకు ఉపనయనం(ఒడుగు) చేయిస్తే సాయం అదించనున్నారట. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్ణయించింది.  దీంతో వారికి ఆర్థిక చేయూత అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇప్పటికే భారతి కార్యక్రమం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు సాయం అందజేస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా విదేశాలు వెళ్లాలని అనుకుంటే ఫిబ్రవరి 29 లోపు ఆన్‌లైన్లో అప్లే చేసుకోవాలని సూచించారు.