AP Cabinet approved 57 items
mictv telugu

57 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం .. వారికి ప్రత్యేక రిజర్వేషన్లు

September 7, 2022

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్ ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఈ సమావేశం నిర్వహించగా, మొత్తంగా 57 అంశాలకు ఆమోదం తెలిపింది. రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే గ్రీన్ ఎనర్జీలో రూ. 81 వేల కోట్ల పెట్టుబడులు, 21 వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులను ఓకే చేసింది. దివ్యాంగులకు నాలుగు శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణ, వైఎస్సార్ చేయూత, సచివాలయంలో 85 అదనపు పోస్టుల మంజూరు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. అటు పోస్టుల మంజూరు పట్ల సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆధ్వర్యంలో థ్యాంక్యూ సీఎం జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.