ఏపీ మంత్రి వర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు అయ్యింది. ఈనెల 14న మధ్యాన్ని కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరు, బడ్జెట్, మూడు రాజుధానుల అంశంపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల దగ్గరకు వస్తుండడం.. పాటు విపక్షాలు స్పీడ్ పెంచడంతో భవిష్యత్ ప్రణాళిక చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో పాటు రెండు అంశాలపై కూలకుషంగా చర్చించనున్నారు. ఒకటి మూడు రాజధానుల అంశం కాగా, రెండవది విశాఖ నుంచి జగన్ పాలనపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఉగాదికి విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ అవుతారనే వార్తలు వస్తుండంతో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా మరోసారి 3 రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆ పరిణామాల ఆధారంగా ముఖ్యమంత్రి ప్రకటన ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది.
మార్చి 14వ తేది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 17న బడ్జెట్ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఎన్నికలకు ఏడాది మాత్రం సమయం ఉండడంతో ఈ బడ్జెట్ కీలకంగా మారింది. కొత్త పథకాలతో పాటు మరిన్ని వరాలు ప్రజలపై కురిసే అవకాశం ఉంది.