గురువారం సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని రేపల్లెను కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఈ డివిజన్లో రేపల్లెతో పాటు వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు వస్తాయి. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య రేపల్లెతో కలిపి 75కు చేరింది. ఇదికాక కేబినెట్ మరిన్ని నిర్ణయాలు తీసుకుంది.
అవి. నెల్లూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరున యూనివర్సిటీ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు పచ్చజెండా వైఎస్సార్ కడప జిల్లాలో ఆస్పత్రి నిర్మాణానికి భూకేటాయింపు పులివెందులలో మహిళా డిగ్రీ కళాశాలలో నియామకాలకు ఆమోదం మడకశిర, తిరుపతి జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు పామర్రులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునికీకరణ సంక్షేమ క్యాలెండర్‌కు అనుగుణంగా పథకాలు కాగా, మలివిడత ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో జరిగిన తొలి కేబినెట్ భేటీ ఇది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.