50వ రోజుకు రాజధాని ఉద్యమం - MicTv.in - Telugu News
mictv telugu

50వ రోజుకు రాజధాని ఉద్యమం

February 5, 2020

kjrgh

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు 50వ రోజుకు చేరాయి. 29 గ్రామాల రైతులు గత కొన్ని రోజులుగా రాజధాని కోసం నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. వినూత్న పద్దతిలో ఆందోళన చేస్తూ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేశారు. మహిళలు, చిన్న పిల్లలు కూడా ఈ ఉద్యమంలో పాల్గోంటున్నారు. 

ఈ ఉద్యమం 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారితో కలిపి నేడు నిరసనలు చేయనున్నారు. అటు తూళ్లురులో ఇప్పటికే రైతులు 50 గంటల దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమం నేటి సాయంత్రంతో ముగియనుంది. రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. కాగా వెలగపూడిలో గత 50 రోజులుగా స్థానిక ప్రజలు రిలే దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.