కేంద్రంపై ఎమ్మెల్యేల గుండు నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రంపై ఎమ్మెల్యేల గుండు నిరసన

February 8, 2018

కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని పార్లమెంటులో టీడీపీ, వైకాపా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీకి ఇప్పటికే ఎంతో చేశామని, ఇక ఇవ్వలేమని మోదీ సర్కారు గునుస్తోంది. మరోపక్క.. బడ్జెట్ అన్యాయంపై రాష్ట్రంలో పార్టీలు ఈ రోజు  బంద్ పాటిస్తున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా ఒక ఎమ్మెల్యే గుండు కొట్టించుకున్నారు.

 

కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉయ్యూరులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘కేంద్రం రాష్ట్రానికి గుండుకొట్టింది.. విభజన హామీలను నిలుపుకోకుండా మొండిచేయి చూపింది.. ’ అని మండిపడ్డతారు. తర్వాత గుండు కొట్టించుకున్నారు. ఏపీకి న్యాయం చేయాలని గత నాలుగు రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో మొరపెట్టుకుంటున్నా తోలుమందం కేంద్రం స్పందించడం లేదని, రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని కేంద్రానికి తెలపాలనే గుండు చేయించుకున్నానని ప్రసాద్ తెలిపారు.