టీడీపీ రాజీనామాలు.. కేంద్ర కేబినెట్ నుంచి ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీ రాజీనామాలు.. కేంద్ర కేబినెట్ నుంచి ఔట్

March 7, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వివాదం చినికిచినికి గాలీవానగా మారింది. హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేయడంతో టీడీపీ మోదీ మంత్రివర్గం నుంచి బయటికొచ్చేసింది.  విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, శాస్త్రసాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరిలు కేబినెట్ నుంచి తప్పుకుంటారని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు.

మోదీకి ఈ విషయాన్ని వివరించే ప్రయత్నిం చేశామని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. అయితే తమ పార్టీ ప్రస్తుతానికి ఎన్డీఏతో ఉంటుందని, మొదటి హెచ్చరికగా కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. సెంటిమెంట్ వల్ల నిధులు రావని జైట్లీ చెప్పడం బాధకలిగించిందన్నారు. అంతకు ముందు చంద్రబాబు మంత్రులు, ఎంపీలతో గంటల తరబడి చర్చించారు.