ఇగురం మరిచిన చంద్రబాబు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇగురం మరిచిన చంద్రబాబు..!

June 13, 2017

ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి…ఎలా ఉండాలి..ఎంత హుందాగా ఉండాలి. చేసే ప్రతి పని..వేసే ప్రతి అడుగు ఒకటికి పదిసార్లు ఆలోచించి వేయాలి. కానీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కు చేరినట్టుంది. ఏం చేస్తున్నది..ఎవరితో ఫోటో దిగుతున్నారో సోయి మరిచారు. వాళ్లతో ఫోటో దిగొచ్చా లేదా…అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండాపోయింది. సీఎం చంద్రబాబు రూల్స్ బ్రేక్ చేశారు. పక్కనే ఉన్న ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సోయి మరిచినట్టున్నారు. ఫోటోకు ఫోజులిస్తున్న బాబును ఆపాల్సింది పోయి…కెమెరాకేసి చూస్తుండిపోయారు. ఇంతకీ చంద్రబాబు ఫోటో దిగింది ఎవరితో.. ఎందుకీ రచ్చ అంటే…
సోషల్ మీడియా పిచ్చి ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా ఎక్కేసింది. ఏం పని చేసినా క్షణాల్లో ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఫోటోలు అప్ లోడ్ చేసేస్తున్నారు. ఎంతలా అంటే రచ్చ రచ్చ అయ్యేలా పిచ్చి పీక్స్ కు చేరింది. ఇందులో నో డౌట్. ఎందుకంటే లైంగిక బాధితురాలితో సోయి మరిచి ఫోటోలకు ఫోజులిచ్చారు. అదీ ఆ అమ్మాయి మైనర్ అని మరిచి మరి.. రూల్స్ ను తుంగలో తొక్కారు. బాబు బాగా బీజీ అయి మరిచిపోయిరనుకుందాం.. ఆపాల్సిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ సోయి ఏమైంది.

గుంటూరు జిల్లాలోని భ‌ట్టిప్రోలులో ఏప్రిల్ 21 న 13 ఏళ్ల బాలిక కిడ్నాపైంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు 45 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బాలిక ఆచూకీ కనుగొన్నారు. బీఎస్ ఎఫ్ మాజీ జవాన్ ,ఆటో డ్రైవర్ నాగేశ్వర్రావు మాయమాటలు చెప్పి కశ్మీర్ తీసుకెళ్లాడని తేల్చారు. నెలన్నరపాటు జ‌మ్మూకాశ్మీర్‌లోని సాంబాలో ఉంచుకున్నాడు.ఇతని చెర నుంచి ఆమెను విడిపించిన పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. తమ బిడ్డ తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని కలిసేందుకు బాధితురాలి తల్లిదండ్రులు వచ్చారు. సాధకబాధకాల్ని చెబుతుంటే బాబు ఓపిగ్గా విన్నారు. అక్కడితో ఆగితే బాగుండేది..ఏదో ఘనకార్యం చేసినట్టు వాళ్లతో ఫోటోలకు ఫోజు ఇచ్చారు.ఇదే ఇప్పుడు రచ్చకు దారితీసింది.

అత్యాచార , లైంగిక బాధితురాళ్లు, మైనర్ అయితే పేర్లు , ఊర్లు ,ప్రాంతం, వారి బంధువుల పేర్లు, చదివే స్కూల్ పేరు ఎక్కడా రాయకూడదు. చెప్పకూడదు..వాళ్ల ఫోటోలను అసలే బయటపెట్టొద్దు…అనే రూల్ ఉంది. బాలిక కిడ్నాప్ ను ఏపీ పోలీసులు చేధించిన సమయంలో ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలు ఈ నిబంధన తుచ తప్పక పాటించాయి. కానీ సీఎం అయి ఉండి చంద్రబాబు… ఈ రూల్ ని పట్టించుకోలే.. మైనర్ ఫోటోను వివరాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఆర్థికసాయం చేస్తామని గొప్పగా చెప్పుకున్నారు. ఇదెక్కడి దారుణం అంటూ మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నాయి. నిర్భయ కేసులో ఎక్కడ బాధితురాలు పేరు , ఫోటో, వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నిస్తున్నాయి. ఓ సిఎం స్థాయి వ్యక్తి ఇలా చేయడం సిగ్గుచేటు అని అంటున్నాయి. మైనర్ పోటోల్ని సోషల్ మీడియా పోస్ట్ చేయడానికి చంద్రబాబు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీస్తున్నాయి.

మొత్తానికి పబ్లిసిటీ పిచ్చిలో చంద్రబాబు పేషి వివాదాల్లో ఇరుక్కుటోంది.బాబుకు పేరేమోగానీ ఎంత బదనాం చేయాలో అంతజేస్తుంది. బాబుగారు జర భద్రం..లేదంటే సీఎం కుర్చీకే ఎసరు తెస్తారు.