అమరావతి స్కాం.. చంద్రబాబు, నారాయణలపై ఎఫ్ఐఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతి స్కాం.. చంద్రబాబు, నారాయణలపై ఎఫ్ఐఆర్

May 10, 2022

అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు, నారయణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో ఏ1గా టీడీపీ జాతీయాధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్‌ని పేర్కొన్నారు. ఇలా మొత్తం 14 పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. 2014 – 19 మధ్యలో రాజధాని పేరిట భూఅవకతవకలు జరిగాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే మాజీ మంత్రి నారయణను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకొని చిత్తూరుకు తరలించారు.