AP CM Jagan announced a compensation of Rs 10 lakh to the victim's family.
mictv telugu

సీఎం సభ వద్ద మహిళ మృతి.. రూ.10 లక్షల పరిహారం అందజేత

August 25, 2022

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా పెడ‌నలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఈ స‌భా వేదికగా నేతన్న నేస్తం కింద ప్రభుత్వ నిధుల‌ను ఆయ‌న ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీ సంఖ్య‌లో జ‌నం హాజ‌రు కాగా… సభకు వచ్చిన ఒక వృద్ధురాలు ఎండ దెబ్బకు మృతి చెందింది. మంచి నీళ్ళు లేక సొమ్మసిల్లి పడిపోయినట్లుగా అక్కడి వారు చెబుతున్నారు.

మృతురాలిని పెడన మండలం దేవరపల్లికి చెందిన సమ్మెట రత్న మాణిక్యంగా(80) గుర్తించారు.వైయస్సార్ నేతన్న నేస్తం పథకం క్రింద చేనేత కార్మికుల కు ఆర్ధిక సాయం అందించేందుకు ఏపీ సీఎం పెడన లో సభకు హాజరయ్యారు. అక్కడే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ విష‌యం తెలుసుకున్న మంత్రి జోగి ర‌మేశ్… విష‌యాన్ని నేరుగా సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఈ వార్త విన్నంత‌నే స్పందించిన సీఎం బాధిత మ‌హిళ కుటుంబానికి రూ.10 లక్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా బాధిత మ‌హిళ కుటుంబానికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం అంద‌జేయాల‌ని ఆయ‌న మంత్రి జోగి ర‌మేశ్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల‌తో వేగంగా క‌దిలిన ర‌మేశ్… రూ.10 ల‌క్ష‌ల చెక్కును గురువార‌మే మాణిక్య‌మ్మ కుటుంబానికి అంద‌జేశారు.