జగన్ రికార్డ్.. 50 వేలమందికి ఒకేసారి అపాయింట్‌మెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ రికార్డ్.. 50 వేలమందికి ఒకేసారి అపాయింట్‌మెంట్

July 3, 2020

appointment

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఔట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు యాభై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..’ఎన్నికలకు ముందు నేను చేపట్టిన పాదయాత్రలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నాను. ఆప్కోస్ ద్వారా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తాం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారు. ఎలాంటి అవినీతి, లంచాలు లేకుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందజేస్తాం.’ అని తెలిపారు. 

అలాగే ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను మార్చాలన్నారు. అన్ని ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కేటాయింపులుంటాయని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ ఉండ కూడదన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారని, గత ప్రభుత్వంలో భాస్కర్ ‌నాయుడు అనే వ్యక్తికి అన్నిచోట్ల కాంట్రాక్ట్‌లు ఇచ్చారని జగన్ అన్నారు. ఈ భాస్కర్ నాయుడు.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడి మనిషని జగన్ వెల్లడించారు.