ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులపై రోజువారీ విచారణ జరపాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే. దీంతో హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులు ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను మొదలెట్టాయి. ఈ విచారణ గత కొన్ని రోజులుగా వరుసగా వాయిదా పడుతోంది. నిన్న జరగాల్సిన విచారణ ఈరోజుకి వాయిదా పడింది.
ఈరోజు జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున ఈ కేసుల్లో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ న్యాయస్థానం ఇన్చార్జీ న్యాయమూర్తి తెలిపారు. జగన్పై హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న మొదలుకానుంది. ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని జగన్ న్యాయవాదుల కోర్టుకి వినతి చేశారు. దీనిపై కోర్టు నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.