AP cm jagan gifted a pen to a baby boy
mictv telugu

ఖరీదైన పెన్‌ను చిన్నారికి గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్

July 26, 2022

కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన కొనసాగుతోంది. గోదావరి వరద ముంపు ప్రాంతాల బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రత్యేక బోటు ద్వారా అవతలి గట్టుకు చేరుకున్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ట్రాక్టర్‌లో లంక గ్రామాల పర్యటనకు బయలుదేరారు.పి.గన్నవరం మండలం జి.పెదపూడిలో ముఖ్యమంత్రి పర్యటించి బాధితులను పరామర్శించారు. వ‌ర‌ద బాధితుల క‌ష్టాల‌ను స్వ‌యంగా ఆల‌కిస్తున్నారు.

ఈ సందర్భంగా త‌న వ‌ద్ద‌కు ఓ విన‌తి ప‌త్రం చేతబ‌ట్టుకుని 8 నెల‌ల బాలుడితో వ‌చ్చిన ఓ మ‌హిళ నుంచి విన‌తి పత్రాన్ని స్వీక‌రించిన జ‌గ‌న్‌… ఆమె చేతిలోని బాలుడిని జ‌గ‌న్‌ త‌న చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ బుడ్డోడు సీఎం జేబులోని పెన్ను లాగాడు. అది కాస్త కిందపడింది. వెంటనే అందరూ కంగారు పడ్డారు. దీంతో సీఎం జగన్ చిరు నవ్వు నవ్వుతూ.. ఆ పెన్ ను ఆ చిన్నారికి బహుమతిగా అందించాడు. నిజానికి అది మోంట్‌బ్లాంక్ బాల్ పెన్. ఖరీదు సుమారు 40 వేల రూపాయలు.. దాని ధర పక్కన బెడితే ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన పెన్ను కావడంతో అది ఎంతో అపురూపమని బాలుడి తల్లి మురిసిపోతోంది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.