ఈ సారి ఓడిపోతే రాజకీయ జీవితం ఉండదు : మంత్రులతో జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ సారి ఓడిపోతే రాజకీయ జీవితం ఉండదు : మంత్రులతో జగన్

April 7, 2022

fbfdbd

ఏపీలో మంత్రుల రాజీనామా సందర్భంగా సీఎం జగన్ చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని, ఆ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబుకు రాజకీయ జీవితం ఉండదని వ్యాఖ్యానించారు. వెయ్యి రోజులు మంత్రులుగా ఉన్న మీరు 700 రోజులు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. టీడీపీని ఓడించే బాధ్యత తీసుకోవాలని కోరారు. మంత్రులుగా పనిచేసిన అనుభవంతో పార్టీకి సేవలందించాలని పేర్కొన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్టు పార్టీ బాధ్యతలప్పగిస్తానని, కొందరికి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, వలంటీర్లను కలుపుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని చెప్పారు. కాగా, మంత్రుల రాజీనామా సందర్భంగా జగన్.. వారితో సరదాగా మాట్లాడారు.