కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ.. ఎందుకంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ.. ఎందుకంటే..

February 5, 2020

njb hfrth

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కోరుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. విభజన తర్వాత ఏపీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని వెంటనే గతంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలుపుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. 

హోదా ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున ప్రధాని చొరవ తీసుకొని వెంటనే ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నివేదిక హోదా అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తేల్చిందని గుర్తు చేశారు. దీంతో పాటు అభివృద్ధి కోసం నిధులు కూడా ఇవ్వాలని ఆయన లేఖలో వెల్లడించారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీకి హోదా ఇవ్వడం కుదరదని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యయమని పేర్కొనడంతో సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.