AP CM Jagan said that Rs 20 lakh should be allocated for each secretariat and Rs 2 crore for each MLA.
mictv telugu

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు.. ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు

July 18, 2022

AP CM Jagan said that Rs 20 lakh should be allocated for each secretariat and Rs 2 crore for each MLA.

తమ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత మెరుగ్గా గడప గడపకు కార్యక్రమం చేరాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలిచ్చినట్లు ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ రోజు సీఎం జగన్ సమీక్ష నిర్వహించగా.. ఆ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి బొత్స.. మీడియాకు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు నిధులు ఇస్తూ సీఎం ఆదేశాలిచ్చారని తెలిపారు.

అలాగే ప్రతి సచివాలయానికి మరో 20 లక్షలు చొప్పున కేటాయించాలని కూడా చెప్పారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల్లో మరింత ఎక్కువగా తిరిగి వారి సమస్యలను తెలసుకోవాలన్నారు. గ్రామాల్లో ఉన్న అభివృద్ది పథకాలకు, సమస్యల పరిష్కారానికి కేటాయించాలని కూడా సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 85 శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.