కేసీఆర్ మాటల్ని పట్టించుకోకండి.. సమీక్షలో జగన్! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ మాటల్ని పట్టించుకోకండి.. సమీక్షలో జగన్!

August 13, 2020

Ap cm jagan sensational comments on telangana cm kcr

తెలుగు రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వాటర్ వార్స్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఏపీ ప్రభుత్వం చేపట్టిన  పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య దూరం పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా జగన్‌పై కేసీఆర్ తీవ్ర వాఖ్యలు చేస్తున్నారు. దీనికి బదులుగా జగన్ కూడా కౌంటర్లు ఇస్తున్నాడు. పోతిరెడ్డిపాడు పాతదేనని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ప్రాజెక్ట్ కొత్తదంటూ జగన్ వాదిస్తున్నాడు. ఈ విషయమై జగన్ కేంద్రంపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. 

కాగా, బుధవారం ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అధికారులు జప్పారని తెలుస్తోంది. దీనిపై జగన్ స్పందిస్తూ.. కేసీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సహా ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలకు త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమాధానం ఇద్దామని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపుల మేరకే చేపడుతున్నామని జగన్ చెప్పినట్లు సమాచారం.