బాలకృష్ణ వియ్యంకుడికి జగన్ షాక్.. 498 ఎకరాల భూమి రద్దు  - MicTv.in - Telugu News
mictv telugu

బాలకృష్ణ వియ్యంకుడికి జగన్ షాక్.. 498 ఎకరాల భూమి రద్దు 

October 30, 2019

AP CM Jagan..

జగన్ ప్రభుత్వం టీడీపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నట్టే ఉంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు గట్టి షాక్ ఇచ్చింది. టీడీపీ హయాంలో బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ తండ్రికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

శ్రీభరత్ తండ్రికి కేటాయించిన భూములతో పాటు విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కోసం లులు గ్రూప్ కేటాయించిన రూ.1500 కోట్ల విలువ చేసే 13.83 భూ కేటాయింపులను కూడా జగన్ కేబినెట్ రద్దుచేసింది. బాలకృష్ణ రెండో వియ్యంకుడికి జగ్గయ్యపేటలో చంద్రబాబు ప్రభుత్వం భారీఎత్తున భూములు కట్టబెట్టిందని మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించిన విషయం తెలిసిందే. రాజధాని భూముల వ్యవహారంలో అంతర్గత వ్యాపారం జరిగిన వైనంలో అదికూడా ఒకటి అని బొత్స ఆరోపించారు. అమరావతిలో రాజధాని వస్తుందని అధికారికంగా ప్రకటించకముందే బాలకృష్ణ వియ్యంకుడు రామారావుకు భారీగా భూ కేటాయింపులు జరిగాయని అన్నారు. 

బొత్స ఆరోపణలపై బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ స్పందించారు. తమకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యంత్రిగా ఉన్నప్పుడే ఆ భూములు లీజుకు ఇచ్చారని కొన్ని పత్రాలు చూపించారు. దీనిపై బొత్స కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో వచ్చిన మరికొన్ని జీవోలను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇదంతా రాజధాని భూముల్లో స్కాం అని అన్నారు. 

కేబినెట్‌లో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు.. 

కేబినెట్‌ నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని మీడియాకు తెలిపారు. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ‘అమ్మ ఒడి’ పథకం వర్తిపంజేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. రెట్టింపు పోషకాహారం అందించే పైలట్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని అన్నారు. 77 మండలాల్ల రూ.90 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. 

-147 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ ఆగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు

-మాల, మాదిగ, రెల్లి.. ఇతర కులాల ప్రత్యేక కార్పొరేష్ల ఏర్పాటుకు ఆమోదం

-కోస్తా జిల్లాలోని 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటుకు ఆమోదం

-నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ల్యాబ్‌లో పరీక్షించి ఇవ్వాలని నిర్ణయం

-పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంపు

-గ్రామీణ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ ఆగ్రి ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆమోదం

-హజ్‌ జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపునకు ఆమోదం

-వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు

అవార్డుతోపాటు రూ.10 లక్షల బహుమతి

-రోబో శాండ్‌ తయారీ యంత్రాల కొనుగోలుకు తక్కువ వడ్డీ రుణాలు

-అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి రెగ్యులరైజేషన్‌

-దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల ఏర్పాటు చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

-కృష్ణా-గోదావరి కాల్వల క్లీనింగ్‌ కమిషన్‌ ఏర్పాటు

-100 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం ఉంటే ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌

-రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు డబ్బు చెల్లింపునకు నిర్ణయం

-ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం

-100 నుంచి 300 చదరపు గజాల వరకు మార్కెట్‌ ధరకే రిజిస్ట్రేషన్‌

-హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకీ ఆమోదం

-నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి నిర్ణయం

-మత్స్యకారులకు ఆర్థిక సాయం, డీజిల్‌పై సబ్సిడీ పెంపుపై నిర్ణయం

-న్యాయవాద సంక్షేమ నిధిపై చట్టంలో మార్పులకు నిర్ణయం

-దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం

-కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని నిర్ణయం

AP CM Jagan