ap cm jagans daughter Harshini Reddy received degree in paris
mictv telugu

జగన్ సమక్షంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న కూతురు హర్షిణి రెడ్డి.. వీడియో

July 2, 2022

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూతురు హర్షిణి రెడ్డి శనివారం తన డిగ్రీ పట్టా పుచ్చుకుంది. తల్లితండ్రి సమక్షంలో ఆమె పట్టా పుచ్చుకోగా, ఈ వీడియోను వైసీపీ డిజిటల్ విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మాస్టర్స్ విద్యనభ్యసించిన హర్షిణి రెడ్డి.. డిస్టింక్షన్స్‌లో పాసయ్యారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే జగన్ దంపతులు పారిస్ చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ వీడియోపై ఆ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.